Brutal Murder: బాటసింగారంలో దారుణం.. అక్కను చంపి ముక్కలుగా చేసిన తమ్ముడు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-18 12:57:53  IST  )

అక్క ప్రవర్తన సరిగా లేదనే నెపంతో తమ్ముడు ఆమెను చంపి, ముక్కలుగా నరికి చెరువులో పడేసిన ఘటన సిటీ శివారులో సంచలనం సృష్టిస్తోంది.

Brutal Murder: బాటసింగారంలో దారుణం.. అక్కను చంపి ముక్కలుగా చేసిన తమ్ముడు
X

దిశ, వెబ్‌డెస్క్: రక్తం పంచుకుని పుట్టిన బంధాలను చెరిపేస్తూ.. కొందరు కాలయముళ్లలా మారుతున్నారు. క్షణికావేశమో, గూడుకట్టుకున్న పగలో తెలియదు కానీ.. మమకారం మంటగలిసి మనిషులు మృగాలుగా తయారు అవుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ (Abdullapurmet) పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాటసింగారంలో తోడబుట్టిన అక్కనే కిరాతకంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి చెరువులో పడేసిన తమ్ముడి ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. బాటసింగారం (Bata Singaram) గ్రామానికి చెందిన పప్పు రామ్ తన ఇటీవలే తన భర్త చనిపోయిన అక్క ప్రవర్తన సరిగా లేదనే కారణంతో గత కొంతకాలంగా ఆమెపై కోపంతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరగగా, ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు ఆమెను ఫిబ్రవరి 28న హతమార్చాడు. కేవలం చంపడమే కాకుండా, సాక్ష్యాలను మాయం చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికి, సమీపంలోని చెరువులో పడేశాడు. అనంతరం తనపై ఎవరికీ అనుమానం రాకుండా తన అక్క కిరాణ షాపుకు వెళ్లి వస్తానని చెప్పి కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకని మెరుపు వేగంతో దర్యాప్తు చేపట్టారు. అనంతరం లభ్యమైన సాక్ష్యాధారాల ఆధారంగా తమ్ముడే అక్కను హత్య చేసినట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటనతో బాటసింగారం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కుటుంబ సభ్యులే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Next Story