Brutal Murder: రాష్ట్రంలో మరో సంచలనం.. హిజ్రాల గ్యాంగ్‌ లీడర్ హాసిని దారుణ హత్య

by Kema Shiva Kumar |

హిజ్రాల గ్యాంగ్‌లీడర్ దారుణ హత్యకు గురైన భయానక ఘటన నెల్లూరు పట్టణం (Nellore City)లో చోటుచేసుకుంది.

Brutal Murder: రాష్ట్రంలో మరో సంచలనం.. హిజ్రాల గ్యాంగ్‌ లీడర్ హాసిని దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: హిజ్రాల గ్యాంగ్‌లీడర్ దారుణ హత్యకు గురైన భయానక ఘటన నెల్లూరు పట్టణం (Nellore City)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హిజ్రాల నాయకురాలు హాసిని (Hasini) మంగళవారం రాత్రి పార్లపల్లి (Parlapally)లోని ఓ ఆలయంలో దైవ దర్శనం కోసం వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై విచక్షణా రహితంగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. అనంతరం వారు అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఈ దుర్ఘటనలో హాసిని (Hasini) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి కీలక అధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి (Nellore Government Hospital) తరలించారు. అయితే, హాసిని మరణ వార్త విన్న హిజ్రాలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story