ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పాము కాటుతో కన్నతండ్రిని హత్య చేసిన కొడుకులు

by Prasad Jukanti |

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నిద్రలో ఉన్న కన్నతండ్రికి పాము కాటు వేయించి హత్య చేసిన కుమాలు తీరు కలకలం రేపింది.

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పాము కాటుతో కన్నతండ్రిని హత్య చేసిన కొడుకులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమాజంలో మానవ సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. డబ్బు కోసమే అయిన వారే దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా డబ్బు కోసం ఇద్దరు అన్నదమ్ములు కన్న తండ్రినే పాము కాటుతో (Brothers Kill Father) చంపించిన దారుణం కలకలం రేపింది. తమిళనాడులోని (Tamil Nadu) తిరువళ్లూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. స్థానిక ప్రభుత్వ పాఠశాల ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న గణేశన్ (56) ఈ ఏడాది అక్టోబర్ లో పాముకాటుతో మరణించినట్లు అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అలా దొరికిపోయిన కంత్రీ కొడుకులు:

పాము కాటుతో చనిపోయిన గణేశన్ పై రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్ ఉంది. ఈ డబ్బు కోసం అతడి ఇద్దరు కుమారులు బీమా సంస్థలను సంప్రదించారు. అయితే గణేశన్ బీమా క్లెయిమ్ లను ప్రాసెస్ చేస్తున్న క్రమంలో ఆయనపై ఇంద భారీ మొత్తంలో పాలసీలు ఉండటం వారి కుమారుల ప్రవర్తన తీరుపై అనుమానం కలగడంతో సదరు ఇన్సూరెన్స్ సంస్థ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగితే భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. బీమా డబ్బుల కోసం కన్న కొడుకులే గణేశన్‍ను పాము కాటుతో చంపించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పథకం ప్రకారమే తమ తండ్రి పేరుతో రూ.3 కోట్లకు బీమా తీయించి ఆ తర్వాత తమ స్నేహితుల ద్వారా పాముకాటు వేయించి చంపినట్లు తేలింది.

మొదటి పాముతో చావలేదని..

ఈ కేసులో తండ్రిని చంపేందుకు కుమారులు వ్యవహరించిన తీరు ఒళ్ళు జలదరించేలా ఉంది. గణేశన్ మృతి చెందడానికి వారం రోజుల ముందు కూడా ఆయన కుమారులు హత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. తమ స్నేహితుల సహకారంతో ఒక పాములు తమ తండ్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన పక్కన వదిలారు. అయితే ఆ పాము కాటు ప్రాణాంతకం కాకపోవడంతో గణేశన్ కు ఏమి కాలేదు. చనిపోతాడనుకున్న తమ తండ్రి చావకపోవడంతో కంగుతిన్న అన్నాదమ్ముళ్లు మొదటి ఎటాక్ తర్వాత వారం రోజులకు రెండో ప్రయత్నం చేశారు. ఈసారి అత్యంత విషపూరితమైన పాముతో గణేశన్ నిద్రపోతున్న సమయంలో ఆయన మెడపై కాటు వేయించారు. అనంతరం ఇదంతా యాక్సిడెంటల్ గా జరిగిందని నమ్మించేందుకు ఆ పామును అక్కడే చంపారు. అయితే తండ్రిని ఆసుపత్రికి తరలించే క్రమంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో కొడుకులు నేరం అంగీకరించారు. తమకు సహాయం చేసిన మరో ఆరుగురిని సైతం ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.

Next Story