అక్కకు అశ్లీల వీడియోలు పంపిన తమ్ముడు.. భరించలేక..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో తమ్ముడు చేసిన పనికి ఆత్మహత్యకు యత్నించింది అక్క. సోదరుడి వేధింపులు తాళలేని యువతి బొద్దింకలు చంపే మందు తాగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

అక్కకు అశ్లీల వీడియోలు పంపిన తమ్ముడు.. భరించలేక..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో తమ్ముడు చేసిన పనికి ఆత్మహత్యకు యత్నించింది అక్క. సోదరుడి వేధింపులు తాళలేని యువతి బొద్దింకలు చంపే మందు తాగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన యువకుడు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఇంట్లో డబ్బు పూర్తిగా దుర్వినియోగం చేశాడు. ఈ క్రమంలోనే తనకు మూడు లక్షలు కావాలని డిమాండ్ చేస్తూ.. అక్కకు అశ్లీల వీడియోలు పంపించాడు. బ్లాక్ మెయిల్ చేశాడు. ఇదంతా తట్టుకోలేని అక్క.. సూసైడ్‌కు యత్నించింది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలిపారు వైద్యులు. కాగా డబ్బు, భూమి గొడవల కారణంగా ఇలాంటి వీడియోలను పంపినట్లు బాధితురాలి భర్త చెప్పుకొచ్చాడు.

Next Story