చెల్లిని ముట్టుకున్నాడని.. కారు డ్రైవర్‌ను హత్య చేసిన అన్న.. ముక్కలు ముక్కలుగా నరికి.. సంచుల్లో నింపి..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. చెల్లిని ప్రేమించాడని కారు డ్రైవర్ రిషికేశ్‌ను హత్య చేశాడు ఆమె సోదరుడు పవన్ మల్లా. చకేరీలోని శివకత్రాలో ఈ ఘటన జరిగింది. పవన్‌తో కలిసి దాదాపు 14 మంది ఈ మర్డర్‌లో పాల్గొన్నట్లు

చెల్లిని ముట్టుకున్నాడని.. కారు డ్రైవర్‌ను హత్య చేసిన అన్న.. ముక్కలు ముక్కలుగా నరికి.. సంచుల్లో నింపి..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. చెల్లిని ప్రేమించాడని కారు డ్రైవర్ రిషికేశ్‌ను హత్య చేశాడు ఆమె సోదరుడు పవన్ మల్లా. చకేరీలోని శివకత్రాలో ఈ ఘటన జరిగింది. పవన్‌తో కలిపి దాదాపు 14 మంది ఈ మర్డర్‌లో పాల్గొన్నట్లు.. ఈ ఘోరాన్ని వీడియో తీసినట్లు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకోగా... ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు.

మర్డర్ ఎలా జరిగింది?

ఆగస్టు 29 రాత్రి రిషికేశ్‌ను గణేశ్ పండల్‌కు తీసుకెళ్లారు ఫ్రెండ్స్ మొగలి, నిఖిల్. ఆ తర్వాత అక్కడి నుంచి మోటార్ సైకిల్‌పై బలవంతంగా కూర్చోపెట్టుకుని.. కాన్పూర్ శివారులో ఉన్న కాకోరీ అడవికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే పవన్‌ మిగతా స్నేహితులతో కలిసి వెయిట్ చేస్తున్నాడు. ముందుగా రిషికేశ్‌‌‌‌‌‌‌‌ను కట్టేసి కొట్టి.. ఆ తర్వాత తల నరికినట్లు తెలుస్తోంది. ఈ చేతితోనే తన సోదరిని తాకాడని చేయి నరికి, గొంతు చీల్చినట్లు సమాచారం. తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి సంచుల్లో చుట్టి గంగా నదిలో పడేశారు. మరోవైపు రిషికేశ కుటుంబం 30న మిస్సింగ్ కేసు నమోదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1న గంగా నదితీరంలో తల లేకుండా బాడీ లభ్యమైంది. కుటుంబ సభ్యులు అది రిషికేశ్ బాడీ అని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా రిషికేశ్ మర్డర్ కేసును చేధించిన పోలీసులు.. ప్రధాన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Next Story