- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోరం..చెల్లికి కట్నం ఇవ్వాల్సి వస్తుందని హతమార్చిన అన్న
ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నయా విలేజ్‌కు చెందిన ఓ వ్యక్తి తన చెల్లెలికి కట్నం కింద ఐదు లక్షలు ఇవ్వాల్సి వస్తుందని.. దారుణంగా హతమార్చాడు. శవాన్ని

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నయా విలేజ్‌కు చెందిన ఓ వ్యక్తి తన చెల్లెలికి కట్నం కింద ఐదు లక్షలు ఇవ్వాల్సి వస్తుందని.. దారుణంగా హతమార్చాడు. శవాన్ని కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి పూడ్చిపెట్టాడు. అయితే అమ్మాయి మిస్ అయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమె చనిపోయిందని, చంపింది సొంత అన్నేనని తేలింది.
నయా గ్రామానికి చెందిన చింకు ప్రసాద్‌కు ఫోర్ లేన్ ప్రాజెక్ట్ కంపెన్సేషన్ కింద ఐదు లక్షలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న కొడుకు రామ్ ఆశీష్ నిషాద్.. తనకు డబ్బు ఇవ్వాలని అడిగాడు. అయితే కూతురు నీలంకు పెళ్లి చేయాలని, కట్నం కింద ఈ డబ్బు ఇస్తానని చెప్పాడు తండ్రి. దీంతో కోపం పెంచుకున్నకొడుకు.. ఇంట్లో అందరూ ఛట్ పూజకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న చెల్లి గొంతు పిసికి చంపాడు. కాళ్లు, చేతులు విరిచి.. ఓ గోనె సంచిలో వేసుకుని.. దాదాపు 70 కిలో మీటర్లు ప్రయాణించి ఖుషీ నగర్ జిల్లాలో పూడ్చి పెట్టాడు.
మరో వైపు ఛట్ పూజ నుంచి తిరిగొచ్చిన కుటుంబీకులు.. నీలం కూడా అక్కడికే వెళ్లిందనుకున్నారు. కానీ రాత్రి అయినా రాకపోవడంతో ఊరంతా వెతికి మిస్సింగ్ కేసు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. రామ్ ఆశీష్‌ను విచారించగా నిజం ఒప్పుకున్నాడు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.






