- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్న దారి కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు
రక్త సంబంధాల్లో ఉండే ప్రేమ అనుభందం అనేవి మనుషుల్లో మచ్చు కైనా కనిపించడం లేదు.

దిశ, వెల్గటూర్ : రక్త సంబంధాల్లో ఉండే ప్రేమ అనుభందం అనేవి మనుషుల్లో మచ్చు కైనా కనిపించడం లేదు. మానవ సంబంధాలు మంట కలిసి పోతున్నవనడానికి ఈ హత్యోదంతమే నిదర్శనం. ఇంటికి వెళ్లడానికి చిన్నదారి కోసం అన్నదమ్ముల మధ్య చెలరేగిన గొడవ చివరకు అన్న ప్రాణాలను బలితీసుకున్న దుర్ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన గొళ్ళెం నాగరాజు రవి అన్నదమ్ముల కొడుకులు. కాగా వరుసకు అన్న ఆయన రవిని కత్తితో పొడిచి తమ్ముడు నాగరాజు హత్య చేశాడు.
వీరిద్దరూ ఈ రెండు కుటుంబాల మధ్య కొంత కాలంగా చిన్నదారీ కోసం గొడవలు జరుగు తున్నాయి. రవి ఇల్లు వెనకాల ఉంటే తమ్ముడు నాగరాజు ఇల్లు ముందుంటుంది. అన్న రవి తన ఇంటికి వెళ్లాలంటే తమ్ముడి ఇంటి పక్కనున్న చిన్న దారి గుండావెళ్లాల్సి ఉంటుంది. ఈ దారికోసమే గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల రవికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది.ఇంటి నిర్మాణం ప్రారంభించారు. దీనికోసం తరచుగా మెటీరియల్ ను వాహనాల్లో తెస్తుండగా మరోసారి గొడవ చెలరేగింది.
గొడవ అంతకంతకు పెద్దది కాగా అర్ధరాత్రి దాటాక తమ్ముడు నాగరాజు అన్న రవి అతని కుమారుడిపై కత్తితో దాడి చేయగా కడుపులో తీవ్ర గాయమై పేగులు బయటకు వచ్చాయి. హుటాహుటిన అతన్ని కుటుంబ సభ్యులు జగిత్యాల తరలించగా మార్గమధ్యంలోనే రవి మృతి చెందినట్లు సమాచారం. కాగా రవి కుమారు డు సైతం స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






