రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. రూ.4 కోట్ల బీమా చేయించి అన్నను చంపిన తమ్ముడు

by Ajay Maddhiboyina |

అప్పులు తీర్చేందుకు సొంత అన్నకు బీమా చేయించి తోడబుట్టిన తమ్ముడే హత్య చేయించాడు. ఈ షాకింగ్ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది.

రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. రూ.4 కోట్ల బీమా చేయించి అన్నను చంపిన తమ్ముడు
X

దిశ, వెబ్ డెస్క్: అప్పులు తీర్చేందుకు సొంత అన్నకు బీమా చేయించి తోడబుట్టిన తమ్ముడే హత్య చేయించాడు. ఈ షాకింగ్ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామడుగుకు చెందిన మామిడి నరేశ్ అనే వ్యక్తి వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి రూ.1.50కోట్ల వరకు అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వారు ఇబ్బంది పెట్టడంతో పాటు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారంగా ముందుగా తన అన్న మానసిక పరిపక్వత లేని వెంకటేష్ పై నాలుగు బీమా సంస్థల్లో వేరు వేరు బీమా సంస్థల్లో రూ.4.14 కోట్ల బీమా పాలసీలను చేయించాడు.

ఈ క్రమంలో రాకేశ్ అనే వ్యక్తి తాను ఇచ్చిన రూ.7 లక్షలు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయగా తన అన్నను చంపేందుకు సహకరిస్తే రూ.7లక్షలకు అదనంగా మరో రూ.13 లక్షలు ఇస్తానని చెప్పాడు. అతడితో పాటు హత్యకు మరో టిప్పర్ డ్రైవర్ ను సైతం ఒప్పించాడు. ఈ నెల 29న అనుకున్న పథకం ప్రకారం టిప్పర్ ఆగిపోయిందని తన అల్లుడి బైక్ పై అన్న వెంకటేష్ ను అక్కడకు పంపించాడు. లారీ కింద జాకీ పెట్టాలని చెప్పి అన్నను లారీ కింద పడుకోబెట్టాడు. తరవాత వెంకటేష్ లారీని ముందుకు నడపగా వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరుసటిరోజు బీమా సంస్థల ప్రతినిధులకు నరేశ్ చెప్పిన స్టోరీ వింటనే అనుమానం వేసింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు నరేష్ తో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Next Story