Crime News: వదినను హతమార్చిన మరిది.. కారణం అదేనా..?

by Chukka Sudharani |   (  Updated:2022-09-09 08:08:03  IST  )

వదిన అంటే తల్లితో సమానం అంటారు. కానీ, అలాంటి వదిననే పొట్టన పెట్టుకున్నాడో మరిది.

Crime News: వదినను హతమార్చిన మరిది.. కారణం అదేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: వదిన అంటే తల్లితో సమానం అంటారు. కానీ, అలాంటి వదిననే పొట్టన పెట్టుకున్నాడో మరిది. ఈ దారుణ ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. మృతురాలు సునంద.. నిందుతుడు మంజునాథగా పోలీసులు గుర్తించారు.

కుందగోళ తాలూకా ఏరినారాయణపుర గ్రామానికి చెందిన సునంద(మృతురాలు)ను.. ఆమె మరిది మంజునాథ(నిందితుడు) పట్టపగలే అతి కిరాతకంగా కొడవలితో నరికి చంపేశాడు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితులను పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం.. ఈ హత్య కుటుంబ కలహాలతో జరిగిందా? లేక వివాహేతర సంబంధమా? మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story