- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా చెల్లెలు పెండ్లికి ముందే చాలా మందితో తిరిగింది.. ఆస్తి కోసం ఓ అన్న వేధింపులు.
ఓ అన్న ఆస్తి కోసం తన సొంత సోదరి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వేధింపులకు గురి చేసి కటకటాపాలయ్యాడు. ఈ సంఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, సిటీక్రైం : ఓ అన్న ఆస్తి కోసం తన సొంత సోదరి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వేధింపులకు గురి చేసి కటకటాపాలయ్యాడు. ఈ సంఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది. అప్పులు అధికమవడంతో ఓ అన్న వారి కుటుంబానికి ఉన్న ఆస్తులను అమ్మేశాడు. ఇంకా డబ్బులు కావాలని తల్లిని వేధించడం మొదలు పెట్టాడు. ఆమె పేరు మీద ఉన్న ఇంటిని కూడా తన పేరు మీద చేయాలని లేదంటే ఇంటిని అమ్మి డబ్బులు ఇవ్వాలని గొడవ పడ్డాడు.
దీంతో తల్లి కొడుకు దగ్గర ఉండకుండా ఓల్డ్ ఏజ్ హోంలో చేరింది. అయితే తన చెల్లెలు తల్లిని తన ఇంట్లో ఉంచుకుని ఆస్తిని తనకు దక్కకుండా చేస్తుందని కోపం రోజు చెల్లి, ఆమె భర్తకు ఫోన్ చేసి దుర్భాషలాడడం మొదలు పెట్టాడు. ఓ దశలో తన చెల్లెలు మంచిదికాదని , పెండికి ముందు చాలా మందితో తిరిగిందని బావకు ఫోన్ లు , మెసేజ్ లు పెట్టి సతాయిస్తున్నాడు. మరికొన్ని సందర్భాల్లో తనకు ఇంటిని అమ్మి డబ్బులు ఇవ్వకుంటే చెల్లి, బావను చంపేస్తానని బెదిరించాడు.
ఈ వేధింపుల పై చెల్లెలు రాచకొండ షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన షీ టీమ్స్ అన్నను అరెస్టు చేసి జైలుకు పంపారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలు, బాలికలు, యువతులు, విద్యార్ధినిలు ఎవరైనా సరే వారు ప్రమాదంలో ఉన్నారని భావిస్తే వెంటనే రాచకొండ వాట్సాప్ నెంబరు 8712662111 ఫోన్ చేయాలని షీ టీమ్స్ అధికారులు సూచించారు.






