విషాదం.. కూతురి పెళ్లి కోసం వేసిన టెంట్ కింద తండ్రి మృతదేహం

by Malleboina Mahesh |

మరికొద్ది గంటల్లో వివాహం జరగాల్సిన ఇంట్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కూతురి పెళ్లి కోసం వేసిన టెంట్ కింద తండ్రి మృతదేహాన్ని ఉంచడంతో ఊరంత విషాదంలో మునిగిపోయింది.

విషాదం.. కూతురి పెళ్లి కోసం వేసిన టెంట్ కింద తండ్రి మృతదేహం
X

దిశ, వెబ్‌డెస్క్: మరికొద్ది గంటల్లో వివాహం జరగాల్సిన ఇంట్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కూతురి పెళ్లి కోసం వేసిన టెంట్ కింద తండ్రి మృతదేహాన్ని ఉంచడంతో ఊరంత విషాదంలో మునిగిపోయింది. ఈ షాకింగ్ ఘటన వికారాబాద్ జిల్లా సగెంకుర్దు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ జరగాల్సిన అవంతి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ ఆమె తండ్రి అనంతప్ప మృతి చెందడంతో ఆనందభరితమైన వాతావరణం ఒక్కసారిగా శోకసంద్రం గా మారింది. పెళ్లి పనుల్లో భాగంగా యాలాల్ వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అనంతప్ప బైక్ స్కిడ్ కావడంతో కిందపడిపోయి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే తాండూర్‌లో చికిత్స అందించిన వైద్యులు అతన్ని అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అనంతప్ప చివరి శ్వాస విడిచారు. దీంతో కూతురు పెళ్లి కోసం వేసిన టెంట్ కింద ఆయన మృతదేహం ఉండటంతో కుటుంబ సభ్యుల ఏడుపుతో ఆ గ్రామం విషాదంలో మునిగిపోయింది. కూతురు పెళ్లి జరగాల్సిన రోజు ఇలాంటి దుర్ఘటన జరగడం అందరిని కలిచివేస్తుంది.

Next Story