చిలకలగూడ హత్య కేసులో పురోగతి.. 10 మంది నిందితుల అరెస్ట్

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌ చిలకలగూడలో జరిగిన యావన్ హత్య కేసులో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

చిలకలగూడ హత్య కేసులో పురోగతి.. 10 మంది నిందితుల అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌ పరిధిలోని చిలకలగూడలో యావన్ (Yavan) అనే యువకుడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిలో 10 మంది నిందితులను పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మే 7వ తేదీన చిలకలగూడ (Chilakalaguda) పోలీస్ స్టేషన్ పరిధిలో యావన్ అనే యువకుడిపై దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది.

పట్టపగలు జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలు, టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డేటా ఆధారంగా నిందితుల ఆచూకీ కనిపెట్టారు. నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు చాకచక్యంగా వారిని వెంబడించి పట్టుకున్నారు. అయితే, యువన్ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు, నిందితుల నేపథ్యంపై పోలీసులు త్వరలోనే పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించనున్నారు. ప్రస్తుతానికి నిందితులను కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story