బ్రేకింగ్ న్యూస్.. టీఆర్ఎస్ నాయకులపై హత్యాయత్నం

by Malleboina Mahesh |   (  Updated:2022-12-05 05:34:29  IST  )

ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామంలో ఈరోజు రాత్రి సమయంలో సీపీఐకి చెందిన కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలపై హత్యాయత్నం ప్రయత్నం చేశారు.

బ్రేకింగ్ న్యూస్.. టీఆర్ఎస్ నాయకులపై హత్యాయత్నం
X

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామంలో ఈరోజు రాత్రి సమయంలో సీపీఐకి చెందిన కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలపై హత్యాయత్నం ప్రయత్నం చేశారు. కామంచికల్లు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతాప్నేని శీను, మేదరమెట్ల శీను ని, 9.30 గంటల సమయంలో, పక్కా వ్యూహంతో దారికాచి అకస్మాత్తుగా, ఆయనపై హత్య ప్రయత్నం చేశారు. తీవ్ర గాయాలైన శీనును ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అత్యవసర చికిత్స చేయించారు. గాయపడిన నాయకుల్ని పరామర్శించారు.


Also Read.....

బండి సంజయ్ కీలక నిర్ణయం.. సంక్రాంతి తర్వాత షురూ!!

Next Story