- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనారోగ్యంతో బోయిన్ పల్లి ఎస్ఐ మృతి...
by Taduka Kalyani |
బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న వీరమల్లు శ్రీనివాస్(58) అనారోగ్యంతో మృతి చెందాడు.

X
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న వీరమల్లు శ్రీనివాస్(58) అనారోగ్యంతో మృతి చెందాడు. 2022 ఫిబ్రవరిలో బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులలో చేరి ఆనాటి నుండి విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య విజయ, ఇద్దరు పిల్లలు. వీరిద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. అల్వాల్ కు చెందిన వీరమల్లు శ్రీనివాస్ అనారోగ్యంతో ఈ నెల 8 న చికిత్స నిమిత్తం గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు.
అయితే ఇతనికి జాoడీస్(కామెర్లు) రావడంతో లివర్ చెడిపోవడం జరిగింది. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ చికిత్స మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ నేపధ్యంలో బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ రవికుమార్. ఎస్ఐలు యుగేందర్, రాజు, నాగేంద్రబాబుల తో పాటు సిబ్బంది ఆయన మృతికి సంతాపం తెలిపారు.
Next Story






