- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్‌లో దారుణం.. పెళ్లి పీటలపైనే వధువును తుపాకీతో కాల్చిన ప్రియుడు
బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి పీటలపైనే ప్రియురాలిని ప్రియుడు తుపాకీతో కాల్చాడు. ఈ ఘటన బక్సర్ ప్రాంతంలో మంగళవారం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి పీటలపైనే ప్రియురాలిని ప్రియుడు తుపాకీతో కాల్చాడు. ఈ ఘటన బక్సర్ ప్రాంతంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బక్సర్‌లో మంగళవారం రాత్రి వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో వధువు, వరుడు స్టేజిపై ఉన్న సమయంలో ఆమె ప్రియుడు దీన్ బంధు వచ్చి తుపాకీతో కాల్చాడు. దీంతో 18 సవంత్సరాల ఆర్తి కుమారి అక్కడిక్కడే కప్పకూలింది.
వధూవరుల చుట్టూ వారి బంధవులు, స్నేహితులు ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో.. వధువు సోదరి తమ వరుడి నుదిటిన బొట్టు పెట్టి ఆర్తి వైపు తిరుతున్న సమయంలో వేదికపై గుమిగూడినవారిలో ఒక వ్యక్తి ఆర్తి పొట్టలో తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ ఆమె కడుపులోకి దూసుకువెళ్లడంతో అక్కడే కుప్పకూలింది.
వెంటనే స్టేజిపై ఉన్నవాళ్లంతా అక్కడ నుండి పరుగులు తీశారు. కుటుంబ సభ్యులు, బంధువులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. మొదట స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యుల సలహా మేరకు అక్కడ నుండి వారణాసి ట్రామా సెంటర్‌కు తరలించారు. వధువు పరిస్థితి ఇంకా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నింధితుడు గతంలో జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉండటంతో అతడి కోసం గాలిస్తున్నారు.






