ట్రాక్ట‌ర్ ఢీ కొని బాలుడు మృతి

by Ratna Kumari |

మ‌ట్టి ట్రాక్ట‌ర్ సైకిల్ ను ఢీ కొట్ట‌డంతో సైకిల్ తొక్కుతున్న బాలుడు అక్క‌డికక్క‌డే మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌రిపెడ మండ‌ల ప‌రిధిలోని తాళ్ల‌వుక‌ల్లు గ్రామంలో చోటు చేసుకుంది.

ట్రాక్ట‌ర్ ఢీ కొని బాలుడు మృతి
X

దిశ‌, మ‌రిపెడ : మ‌ట్టి ట్రాక్ట‌ర్ సైకిల్ ను ఢీ కొట్ట‌డంతో సైకిల్ తొక్కుతున్న బాలుడు అక్క‌డికక్క‌డే మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌రిపెడ మండ‌ల ప‌రిధిలోని తాళ్ల‌వుక‌ల్లు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని లింగయ్య, ధనమ్మ దంపతులు వ్యవసాయ కూలీలుగా ప‌ని చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు బోయిని ప్రణీత్ (9), 2వ తరగతి చదువుతున్న కుమార్తె కలదు. ప్రణీత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం నాలుగో తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవులు కావడంతో తండ్రి కుమారుడికి పది రోజుల క్రితమే కొత్త సైకిల్ కొనిచ్చాడు.


జూన్ 2 అవతరణ వేడుకల సందర్భంగా ఉదయాన్నే పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం వరకు స్కూల్లోనే ఉన్న బాలుడు అనంతరం చేను వద్ద పని చేస్తున్న తల్లి వద్దకు చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకొని వెళ్లి తినిపించాడు. ఇంటికి వెళుతున్నాను అని చెప్పి వస్తున్న క్రమంలో మట్టి ట్రాక్టర్ వేగంగా బాలుడి సైకిల్ ని ఢీ కొట్టడంతో వెనుక చక్రం కింద పడి ప్రణీత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనా స్థలాన్నీ మరిపెడ ఎస్ హెచ్ ఓ గండ్రాతి సతీష్, అదనపు ఎస్ఐ మహబూబ్ సందర్శించి ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Next Story