కారు చక్రాల కింద పడి బాలుడు మృతి

by Taduka Kalyani |

మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు చక్రాల కింద మూడేళ్ల బాలుడు పడడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కారు చక్రాల కింద పడి బాలుడు మృతి
X

దిశ, రాజేంద్రనగర్ : మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు చక్రాల కింద మూడేళ్ల బాలుడు పడడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మైలార్ దేవ్ పల్లి ఎస్సై విశ్వనాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పల్లెచెరువు ప్రాంతంలో గోబింద్ రామ్ సోమరి దేవిలు తమ కుమారుడు షియం కుమార్(3)తో కలిసి నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటుండగా అదే సమయంలో విజయ్ నేహా పాలిమర్స్ కంపెనీకి చెందిన కారు టిజి07ఏకే 3600ను డ్రైవర్ అరవింద్ (30) వేగంగా తీసుకువచ్చాడు. ఆడుకుంటున్న బాలుడిపై కి ఎక్కించడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు బాలుడిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు గురువారం ఉదయం మృతి చెందాడు. బాలుడి మృతికి కంపెనీ యాజమాన్యం కారణమని గురువారం కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని విజయ్ నేహా పాలిమర్స్ కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు చేరుకొని ఆందోళన కారులతో మాట్లాడి సర్దిచెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story