TG: తీవ్ర విషాదం.. భవనం పైనుంచి జారిపడి బాలుడు మృతి

by Gantepaka Srikanth |

మంచిర్యాల(Mancherial)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ 4వ అంతస్తు పైనుంచి జారిపడి 11 నెలల బాలుడు మృతిచెందాడు.

TG: తీవ్ర విషాదం.. భవనం పైనుంచి జారిపడి బాలుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల(Mancherial)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ 4వ అంతస్తు పైనుంచి జారిపడి 11 నెలల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన గౌతమీనగర్‌లోని సోమవారం సాయంత్రం జరిగింది. మంచిర్యాలలో జరిగిన ఓ వివాహ వేడుకకు బాలుడి తల్లిదండ్రులు వచ్చారు. వివాహం అనంతరం గౌతమీనగర్‌లో తెలిసిన వాళ్లింటికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆడుకుంటూ ఆడుకుంటూ బాలుడు భవనం పైనుంచి జారిపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story