వేర్వేరు కార‌ణాల‌తో ఇద్ద‌రూ మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఉట్నూర్ : వేర్వేరు కార‌ణాల‌తో ఇద్ద‌రూ మృతి చెందిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఉట్నూర్ ఎస్సై ఈశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాంజీగోండ్ నగర్ కాలనీకి చెందిన

వేర్వేరు కార‌ణాల‌తో ఇద్ద‌రూ మృతి
X

దిశ‌, ఉట్నూర్ : వేర్వేరు కార‌ణాల‌తో ఇద్ద‌రూ మృతి చెందిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఉట్నూర్ ఎస్సై ఈశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాంజీగోండ్ నగర్ కాలనీకి చెందిన ఆత్రం విఠల్(32) కుటుంబ కలహాలతో మద్యం మత్తులో క్షణికావేశంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన అర్క భీంరావ్(29) జీవనం కోసం అత్తాగారింటివద్ద భూమిని కౌలుకు తీసుకోని జోన్నపంటను సాగు చేస్తున్నాడు. అధిక వర్షాల కారణాంగా పంట దెబ్బదింతి. దీనికి తోడుగా పనులు సైతం సరిగ్గ దొరకడం లేదని మద్యం మత్తులో ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుల కుటుంబ సభ్యులు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు ఎస్సై ఈశ్వర్ తెలిపారు.

Next Story