- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. కొనసాగుతోన్న తనిఖీలు
by Kema Shiva Kumar |
దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు, పాఠశాలలు, న్యాయస్థానాలకు ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్ రావడం సర్వసాధారణమైపోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు, పాఠశాలలు, న్యాయస్థానాలకు ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్ రావడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)లో బాంబు పెట్టామంటూ ఓ ఆగంతకుడు అధికారులకు మెయిల్ పంపాడు. దీంతో అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్ (CISF) సిబ్బంది ఎయిర్‌పోర్టుతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఢిల్లీ బాంబు బ్లాస్ట్ (Delhi Bomb Blast) నేపథ్యంలో క్షుణ్ణంగా అనుమానిత వస్తువులను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సందర్శకుల పాస్ కౌంటర్లను మూసివేశారు.
Next Story






