- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు.. చెన్నై LTTE పేరిట ఈ-మెయిల్
అనంతపురం జిల్లా కోర్టుకు చెన్నై LTTE పేరుతో వచ్చిన ఈ-మెయిల్ బాంబు బెదిరింపు ఒక్కసారిగా కలకలం సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని అనంతపురం జిల్లా కోర్టు (Anantapur District Court)కు బాంబు బెదిరింపు రావడంతో బుధవారం ఉదయం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చెన్నైకి చెందిన LTTE (Liberation Tigers of Tamil Eelam) పేరుతో కోర్టు అధికారులకు అందిన ఓ ఈ-మెయిల్ ఇందుకు కారణమైంది. బుధవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికే అధికారుల అధికారిక ఈ-మెయిల్ ఐడీకి ఒక మెసేజ్ వచ్చింది. ‘కోర్టు ప్రాంగణంలో బాంబులు అమర్చాం.. కొద్దిసేపట్లోనే అవి పేలబోతున్నాయి’ అంటూ ఆ మెయిల్‌లో దుండగులు హెచ్చరించారు. ఈ విషయాన్ని గమనించిన కోర్టు సిబ్బంది తక్షణమే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.
సిబ్బంది, న్యాయవాదుల పరుగు..
బాంబు వార్త తెలియగానే కోర్టు హాల్స్‌లో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. విచారణలో ఉన్న కేసులు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే టూ-టౌన్ పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS), స్నిఫర్ డాగ్స్ రంగంలోకి దిగాయి. ఈ మేరకు కోర్టులోని ప్రతి గదిని, రికార్డ్ రూమ్‌లను, పార్కింగ్ ఏరియాను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అసలు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది..? దీని వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవలెవరు అన్న కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నారు.






