- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HMDA హెడ్ ఆఫీసుకు బాంబు బెదిరింపు.. కొనసాగుతోన్న తనిఖీలు
హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ఉన్న హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని అమీర్‌పేట్ (Amirpet)లో ఉన్న హెచ్‌ఎండీఏ (HMDA) ప్రధాన కార్యాలయానికి ఇవాళ బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ (Email) ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడటంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం హెచ్‌ఎండీఏ కార్యాలయ అధికారిక మెయిల్ ఐడీకి ఆఫీసులో పలుచోట్ల బాంబులు ఉన్నట్లుగా మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
అనంతరం పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో స్పాట్‌కు చేరుకుని భవనంలోని అన్ని అంతస్తులను, పార్కింగ్ ఏరియాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కార్యాలయంలోని సిబ్బందిని, పనుల కోసం వచ్చిన సందర్శకులను పోలీసులు బయటకు పంపేశారు. భవనం చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇది ఆకతాయిల పనా.. లేక మరేదైనా కుట్ర కోణం ఉందా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది.. దాని ఐపీ అడ్రస్ ఏంటి? అనే వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు సేకరిస్తున్నారు.






