- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌కు బెదిరింపులు
బాలీవుడ్ ఇండస్ట్రీకి దుండగుల నుంచి బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో హీరో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్‌లను చంపేస్తానమి దుండగులు, గ్యాంగ్ స్టర్లు బెదిరించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీకి దుండగుల నుంచి బెదిరింపులు (Threats) కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో హీరో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్‌లను చంపేస్తానమి దుండగులు, గ్యాంగ్ స్టర్లు బెదిరించిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోకు బెదిరింపులు వచ్చాయి. హీరో రణవీర్ సింగ్ వాట్సాప్ వాయిస్ మెసెజ్ పంపారు. అందులో దుండగులు హీరో రణవీర్ (Hero Ranveer)ను ఉద్దేశించి కోట్ల రూపాయల డబ్బు (extortion) డిమాండ్ చేశారు. తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వారమని చెప్పుకుంటూ, డిమాండ్ నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటనపై రణవీర్ వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్ (Mumbai Crime Branch)ను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రణవీర్ ప్రస్తుతం తన భార్య దీపికా పదుకొనే, కుమార్తె దువా తో కలిసి ఉంటున్న నివాసం వద్ద భద్రతను గణనీయంగా పెంచారు.
ఇటీవల ముంబైలో ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty) నివాసం వెలుపల కాల్పులు జరిగిన సంఘటనను మరవకముందే, ఇప్పుడు రణవీర్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం సినీ పరిశ్రమ (Film Industry)ను భయాందోళనకు గురిచేస్తోంది. గత 15 రోజుల్లో దాదాపు డజను మంది సినీ ప్రముఖులకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. రణవీర్ తన నివాసం వద్ద ఆరుగురు సాయుధ ప్రైవేట్ గార్డులను కూడా నియమించుకోగా, వారి కదలికలపై తోటి నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు లేఖ రాశారు. రణవీర్ నటించిన ‘ధురంధర్’ సినిమా భారీ విజయం సాధించి, వచ్చే నెలలో దాని సీక్వెల్ ‘ధురంధర్ 2’ విడుదల కానున్న తరుణంలో ఈ బెదిరింపులు రావడం గమనార్హం.






