అభిషేక్ రావు ఖాతాలోకి రూ.3.85 కోట్లు ఎలా వచ్చాయి.. తేలేది ఇవాళే!

by Disha Web Desk 2 |
అభిషేక్ రావు ఖాతాలోకి రూ.3.85 కోట్లు ఎలా వచ్చాయి.. తేలేది ఇవాళే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇవాళ్టి నుంచి బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు విచారించనున్నారు. మూడ్రోజుల పాటు ఆయన్ను సీబీఐ ప్రశ్నించనున్నది. అభిషేక్ రావు నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో అభిషేక్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించనున్నది. అభిషేక్ రావు ఖాతాల్లోకి రూ.3 కోట్ల 85 లక్షలు వచ్చాయంటున్న సీబీఐ అధికారులు.. ఆ లెక్కల వివరాలపై కూపీ లాగనున్నారు. అలాగే లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో అభిషేక్ రావు అనేక సమావేశాలకు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు ఎక్కడెక్కడికి వెళ్లారు.. ఎవరెవరిని కళిశారు అనే వివరాలపై ఆరా తీయనున్నారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును సోమవారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైతో కలిసి ఆయన వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు ఈ స్కాంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులెవ్వరినీ అరెస్ట్ చేయలేదు. తొలిసారి అభిషేక్ రావును అరెస్ట్ చేయడంతో లిక్కర్ స్కాం మరోసారి ప్రకంపనలు రేపుతోంది. అభిషేక్ రావు విచారణలో అనేకమంది వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : లిక్కర్ స్కామ్‌లో హాట్‌టాపిక్‌గా సికింద్రాబాద్.. కథ అంతా నడిచేది ఆ కాంప్లెక్స్‌లోనే!


Next Story

Most Viewed