- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇబ్రహీంపట్నం చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, ఇబ్రహీంపట్నం : చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పెద్ద చెరువులో శనివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం నీటిపై తేలియాడుతూ స్థానికులకు కనిపించింది. దీంతో చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీసి పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మహిళ గుర్తింపు కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు, అలాగే ఆమె మృతి వెనుక గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.






