- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేశ్వరంలో దారుణం.. చెరువులో తేలిన శిశువు మృతదేహం
by Muthe.Rajitha |
మహేశ్వరంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : మహేశ్వరంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చెరువులో ఓ నవజాత శిశువు మృతదేహం తేలడం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కోళ్లపడకల్ గ్రామా శివారులోని పత్తేసాగర్ చెరువు వద్ద గల అలుగులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం అటువైపు వెళ్లినవారికి చెరువులో తేలుతున్న శిశువు మృతదేహం కనబడటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు, శిశువు మృతదేహాన్ని తీయించి, పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. కాగా శిశువు మృతదేహం చెరువులో తేలిన ఘటన స్థానికంగా సంచలనమ్ రేపింది.
Next Story






