మొజాంబిక్ తీరంలో లాంచ్ బోటు బోల్తా.. ముగ్గురు భారతీయుల దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-18 07:15:40  IST  )

బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి చెందిన ఘటన మొజాంబిక్‌లో చోటుచేసుకుంది.

మొజాంబిక్ తీరంలో లాంచ్ బోటు బోల్తా.. ముగ్గురు భారతీయుల దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్‌: బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మొజాంబిక్‌లోని బీరా ఓడరేవు సమీపంలో గురువారం అర్థరాత్రి ఒక ట్యాంకర్‌కు చెందిన సిబ్బందిని తీసుకెళ్తున్న లాంచ్ బోటు ఒక్కసారిగా తిరగబడింది. ఈ బోటులో మొత్తం 14 మంది భారతీయులు ఉండగా.. అందులో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. సిబ్బంది ఫిఫ్ట్ మారుతున్న క్రమంలో ఓడరేవు నుంచి ఒడ్డున ఆపి ఉన్న ఓడకు లాంచ్‌ బోట్‌లో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. భారతీయుల మృతి పట్ల మొజాంబిక్‌లోని భారత హై కమిషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అదేవిధంగా ప్రమాద ఘటనపై హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గల్లంతైన వారి కోసం ఘటనా స్థలంలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Next Story