- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘెర పడవ ప్రమాదం..60 మంది మృతి
by Ajay Maddhiboyina |
నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 60 మంది మృతి చెందారు. బోర్గూ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 60 మంది మృతి చెందారు. బోర్గూ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మలలే జిల్లాలోని తుంగన్ సులే నుండి ఓ సంతాపసభకు వెళుతున్న సమయంలో ఇది జరిగింది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. నీళ్లలో పడినవారిలో 50 మందిని రక్షించినట్టు అధికారులు చెబుతున్నారు. వారిలో మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. మరణించినవారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారని తెలిపారు. పడవ ఓవర్ లోడ్ అవ్వడంతో చెట్టు మొద్దును ఢీ కొట్టి బోల్తా కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు.
Next Story






