- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్తీక పౌర్ణమి వేళ వరంగల్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం
కార్తీక పౌర్ణమి వేళ వరంగల్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేగింది. జిల్లాలోని వర్దన్నపేట మండలం ఎల్లంద గ్రామంలో క్షుద్రపూజలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవలే గ్రామంలో ఓ సారి క్షుద్రపూజలు చేయగా మరోసారి కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: కార్తీక పౌర్ణమి వేళ వరంగల్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేగింది. జిల్లాలోని వర్దన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో క్షుద్రపూజలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పసుపు ,కుంకుమలతో ముగ్గులు వేసి చుట్టూ నిమ్మకాయలు పెట్టారు. దీంతోపాటు మోదుగాకులో పిండి వంటలు భయంకర దృశ్యాలను ఏర్పాటు చేశారు. ఇటీవలే గ్రామంలో ఓ సారి క్షుద్రపూజలు చేయగా మరోసారి కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్థానికులు వాకింగ్ వెళ్లిన సమయంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లను గుర్తించారు.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. గ్రామంలో తరచూ క్షుద్రపూజలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతిరోజు పిల్లలు, యువత వాకింగ్ కు వస్తారని వాళ్లు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. పూజలు చేసినచోట ఏదో బలిచ్చిన ఆనవాళ్లు సైతం కనిపిస్తున్నాయని తెలిపారు. ముగ్గులు వేసి వాటి మధ్య పువ్వులు పెట్టడం, నిమ్మకాయలు పెట్టడం లాంటివి చేస్తున్నారని చెప్పారు. ఇలాంటివి రిపీట్ అవ్వకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.






