- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం.. సొంత కోడలును రేప్ చేసిన బీజేపీ నాయకుడు.. దుమారం రేపుతున్న ఘటన
రాజస్థాన్ కోటా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడు కోడలిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. భారతీయ జనతాపార్టీ నేత ఓం ప్రకాశ్ మేఘవాల్.. ఇంతకు ముందు ఆర్మీ అధికారిగా పని చేసి రిటైర్ అయ్యాడు. కొడుకుకు వివాహం చేసిన

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ కోటా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడు కోడలిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. భారతీయ జనతాపార్టీ నేత ఓం ప్రకాశ్ మేఘవాల్.. ఇంతకు ముందు ఆర్మీ అధికారిగా పని చేసి రిటైర్ అయ్యాడు. కొడుకుకు వివాహం చేసిన ఆయన.. కోడలిపై కామం పెంచుకున్నాడు. తనయుడు జైపూర్‌లో చదువు కోసం వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కోడలిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆమె స్నానం చేస్తుండగా చూశాడని.. రాత్రి అత్యాచారం చేశాడని.. తాను అరవడంతో పారిపోయాడని తెలిపింది బాధితురాలు. ఈ విషయంపై ఆగస్టు 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఖాకీలు చర్యలు తీసుకోకపోయే సరికి కుటుంబంతో కలిసి ఎస్‌డీఎం కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది. దీంతో ఓం ప్రకాశ్‌ను రామ్ గంజ్ మండి రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో హాజరుపరిచి.. జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.






