జీహెచ్ఎంసీ ఉద్యోగులపై దాడి చేసిన బీజేపీ కార్పొరేటర్

by Chintha Aamani |   (  Updated:2025-05-03 15:00:09  IST  )

జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్ -14లో ఉద్యోగులపై దాడికి పాల్పడిన

జీహెచ్ఎంసీ ఉద్యోగులపై దాడి చేసిన బీజేపీ కార్పొరేటర్
X

దిశ,కార్వాన్ : జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్ -14లో ఉద్యోగులపై దాడికి పాల్పడిన జాంబాగ్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ పై క్రిమినల్ చర్యలు చేపట్టాలని మున్సిపల్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా శనివారం అబిడ్స్ లోని సర్కిల్ 14 కార్యాలయానికి తాళాలు వేసి , కార్యాలయంలో బైటాయించిన ఉద్యోగులు తమ నిరసనను వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం సమయంలో కార్యాలయంలో విధుల్లో ఉన్న తనపై , చైన్ మెన్ ఆరిఫ్ పై అకారణంగా కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ దాడికి పాల్పడ్డారని సెక్షన్ ఆఫీసర్ నరేష్ తెలిపారు. ఎందుకు దాడి చేశారని టౌన్ ప్లానింగ్ ఏసీపీ మంజుల సింగ్ కార్పొరేటర్ ని ప్రశ్నిస్తే , ఆమెను కూడా అసభ్య పదజాలంతో దూషించారని అన్నారు.

గత కొంత కాలంగా సొంత పనుల కోసం కార్పొరేటర్ తమపై ఒత్తిడి చేస్తున్నారని,ఆయన చెప్పినట్లు వినకపోవడం వల్లే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కార్పొరేటర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని సర్కిల్ -14 ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు రక్షణ లేకపోతే , విధులు ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు. అనంతరం ఏసీపీ మంజుల సింగ్ ఆధ్వర్యంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో రాకేష్ జైస్వాల్ పై ఫిర్యాదు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించి , దాడికి పాల్పడ్డారని వారి ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ యాక్ట్ 132 , 352 కింద కేసు నమోదు చేసినట్లు అబిడ్స్ సిఐ ఇమాన్యుయల్ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై కార్పొరేటర్ చేసిన దాడి పై పలువురు విశ్లేషకులు మండి పడుతున్నారు.

Next Story