- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. యువకుడి మృతి
by Taduka Kalyani |
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సై రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కుకట్ పల్లిలో నివాసం ఉండే కార్తీక్ (24) ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

X
దిశ, రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సై రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కుకట్ పల్లిలో నివాసం ఉండే కార్తీక్ (24) ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి శంషాబాద్‌లో తన స్నేహితుడిని కలిసి తిరిగి కూకట్‌పల్లి వైపు వెళ్తున్న సమయంలో ఏజీ కాలేజ్ మెయిన్ గేట్ సమీపంలోని బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కార్తీక్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడు అతివేగంగా బైకును డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






