- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దెబ్బలు తట్టుకోలేక పారిపోయిన మొదటి భార్య.. రెండో భార్యను గొడ్డలితో నరికి.. మూడో భార్యను కత్తితో పొడిచి.. భర్త నేర చరిత్ర
బీహార్ దర్భంగాలో ఓ వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకుని.. భార్యలను దారుణంగా హింసించి, హతమార్చిన కేసు వెలుగులోకి వచ్చింది. నెహ్రా పీఎస్ పరిధిలోని జగదీశ్ పూర్‌కు చెందిన వికలాంగుడైన జీవాచ్ పాశ్వాన్ పందొమ్మిదేళ్ల తన కుమార్తె విభా దేవిని..

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ దర్భంగాలో ఓ వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకుని.. భార్యలను దారుణంగా హింసించి, హతమార్చిన కేసు వెలుగులోకి వచ్చింది. నెహ్రా పీఎస్ పరిధిలోని జగదీశ్ పూర్‌కు చెందిన వికలాంగుడైన జీవాచ్ పాశ్వాన్ పందొమ్మిదేళ్ల తన కుమార్తె విభా దేవిని.. దర్భంగాకు చెందిన ప్రమోద్ కుమార్ పాశ్వాన్‌కు ఇచ్చి పెళ్లిచేశాడు. ప్రస్తుతం ఆమెకు పదహారు రోజుల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. కానీ బాలింత అని కూడా చూడకుండా విభా దేవిపై తీజ్ పండుగ రోజున దాడి చేశాడు భర్త. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయమైన ఆమె కొట్టుమిట్టాడుతుండగా.. మళ్లీ నిందితుడే హాస్పిటల్‌కు తరలించాడు. ముందుగా దర్భాంగా మెడికల్ కాలేజీకి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో పీఎంసీహెచ్‌కు తరలించాలని సూచించారు. కానీ హాజీపూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
దీంతో గ్రామస్తులు పోలీసులకు ప్రమోద్ నేర చరిత్ర గురించి చెప్పారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ప్రమోద్ ఒక్కరిని కూడా సరిగ్గా చూసుకోలేదని తెలిపారు. మొదటి భార్య భర్త దెబ్బలు తట్టుకోలేక పారిపోయిందని.. కనీసం ఆమె ఆ విధంగానైనా సేవ్ అయిందని చెప్పారు. ఇక రెండో భార్య కడుపుతో ఉండగా గొడ్డలితో నరికి చంపాడని.. మూడో భార్య అయిన విభను ఈ విధంగా పొట్టన పెట్టుకున్నాడని తెలిపారు. నిందితునిపై కఠిన చర్యలకు డిమాండ్ చేశారు.






