పూణే డెలివరీ బాయ్ అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్.. అమ్మాయే సెల్ఫీ తీసుకుని..!

by Ajay Maddhiboyina |

పూణే డెలివరీబాయ్ అత్యాచార ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. 22 ఏళ్ల ఐటీ ఉద్యోగి తనపై డెలివరీ బాయ్ అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

పూణే డెలివరీ బాయ్ అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్.. అమ్మాయే సెల్ఫీ తీసుకుని..!
X

దిశ, వెబ్ డెస్క్: పూణే డెలివరీబాయ్ అత్యాచార ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. 22 ఏళ్ల ఐటీ ఉద్యోగి తనపై డెలివరీ బాయ్ అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సంచలనంగా మారడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బృందాలుగా విడిపోయి యువ‌కుడిని అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచార‌ణ‌లో మాత్రం షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. యువ‌తిపై అస‌లు అత్యాచారం జ‌ర‌గ‌లేద‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ అమితేష్ కుమార్ వెల్లడించారు.

అంతే కాకుండా ఆరోప‌ణ‌లు చేసిన యువ‌కుడు యువ‌తికి 2ఏళ్లుగా ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తి అని చెప్పారు. ఇద్ద‌రూ ఒకే వ‌ర్గానికి చెందిన వాళ్ల‌ని, సెల్ఫీని ఆ యువతే స్వ‌యంగా తీసుకుంద‌ని అన్నారు. అంతే కాకుండా మ‌ళ్లీ వ‌స్తా.. అంటూ ఫోన్ లో వార్నింగ్ మెసేజ్ కూడా ఆ యువ‌తే రాసుకుంద‌ని తెలిపారు. యువ‌తిపై ఎలాంటి మ‌త్తు ప‌దార్థం చ‌ల్ల‌లేద‌ని అన్నారు. యువ‌తి మాన‌సిక ప‌రిస్థితి బాగాలేద‌ని వెల్ల‌డించారు. అత్యాచారం జ‌రిగిందా లేదా నిర్ధారించ‌డనికి మెడిక‌ల్ టెస్టులు నిర్వహించాల్సి ఉంద‌ని తెలిపారు. యువ‌తి ఆమె త‌మ్ముడితో క‌లిసి అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటుందని చెప్పారు.

Next Story