నకిలీ ఐపీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అరెస్ట్

by Kema Shiva Kumar |

నకిలీ ఐపీఎస్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.

నకిలీ ఐపీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నకిలీ ఐపీఎస్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫిల్మ్‌నగర్ పరిధిలోని కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌ను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. అయితే, నకిలీ ఐపీఎస్ శశికాంత్‌ను అరెస్టు చేసే క్రమంలో ఆయన ఇంట్లో కానిస్టేబుల్ చోరీకి పాల్పడ్డాడు. నిందితుడి ఇంటితో పాటు అరెస్టు క్రమంలో వీడియో తీస్తూనే ఏకంగా రూ.25 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌ను దొంగతనం చేశాడు. శశికాంత్ విచారణలో భాగంగా ప్రాపర్టీస్ లిస్ట్‌లో రోలెక్స్ వాచ్ మిస్సింగ్ అయినట్టు గ్రహించిన సిబ్బంది శ్రవణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. తప్పు ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కాగా, ఫిల్మ్‌నగర్ పరిధిలో నివాసం ఉంటున్న శశికాంత్ (Shashikant) అనే వ్యక్తి తనను తాను ఐపీఎస్ అని చెప్పుకుంటూ హల్‌చల్ చేస్తున్నాడు. ఏకంగా ఇద్దరు గన్‌మెన్‌లు, ఫేక్ ఐడీ కార్డులను పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. నగర శివార్లలో నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్ల వద్దకు వెళ్లి బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తానని బాధితుల నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అసలు అతడు ఐఏఎస్ ఆఫీసర్లే కాదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు

Next Story