- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిత్య పెళ్లికూతురు కేసులో ట్విస్ట్..11 మంది భర్తలు ఎక్కడ?
అమలాపురం నిత్యపెళ్లికూతురు కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నీలిమ అనే మహిళ 12 మందిని పెళ్లి చేసుకుని వారి వద్ద నుండి

దిశ, వెబ్ డెస్క్: అమలాపురం నిత్యపెళ్లికూతురు కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నీలిమ అనే మహిళ 12 మందిని పెళ్లి చేసుకుని వారి వద్ద నుండి డబ్బులు దోచుకుందని ఓ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పెళ్లై విడాకులు తీసుకున్న పరుషులనే టార్గెట్ చేస్తూ పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆరోపణలపై నీలిమ స్పందించారు.
తనపై ఆరోపణలు చేసిన వ్యక్తే మోసగాడని అన్నారు. అతడు పెళ్లిళ్లు చేసుకుని అమ్మాయిలను విదేశాలకు ట్రాన్స్‌పోర్ట్ చేస్తారని ఆరోపించారు. తనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, 12 మందిని పెళ్లి చేసుకుంటే మరో 11 మంది ఎక్కడ ఉన్నారో చూపించాలని నిలదీశారు. వాళ్లు చేసిన ఆరోపణలు అన్నింటికీ ప్రూఫ్ చూపించాలని అన్నారు. తనకు పెళ్లి సమయంలో రూ.10 లక్షలు ఇచ్చారని, యువకుడికి ఇప్పటికే వివాహం అవ్వడంతో పాటు ఇద్దరు పిల్లలు ఉండటంతోనే పెళ్లి ఖర్చులు భరిస్తామని తనకు పెళ్లి సమయంలో డబ్బులు ఇచ్చారని చెప్పారు.






