- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోనున్న ఆ ఇద్దరు కీలక నేతలు
భద్రతా బలగాల చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన సభ్యులు వరుస పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్/నిర్మల్: భద్రతా బలగాల చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన సభ్యులు వరుస పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ప్రశాంత జీవనం వైపు అడుగులు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఓ వైపు పోలీసుల ఒత్తిడి, ప్రభుత్వ పునరావాస విధానాల ప్రభావంతో చాలా మంది దళ సభ్యులు ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మే 2025లో 20 మంది మావోయిస్టులు అరెస్ట్ కాగా, 8 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారు. జూలై 14, 2025న మరో ఐదుగురు మావోయిస్టులు ములుగు ఎస్పీ శబరీష్ సమక్షంలో లొంగిపోయారు. వారికి ప్రభుత్వం రూ.25,000 తక్షణ సాయం, వైద్యం, పునరావాసం వంటి సహాయాలను అందిస్తోంది. ‘పోరు కన్నా ఊరు మిన్న’ కార్యక్రమం ద్వారా మావోయిస్టులను సమాజంలో కలపడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ సాయంత్రం రామగుండం సీపీ ఎదుట మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఆత్రం లచ్చన్న, ఆత్ర అరుణ లోంగిపోనున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్‌గా ఆత్రం లచ్చన్న కొనసాగుతుండగా.. బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా అరుణ ఉన్నారు. ఈ హఠాత్పరిణామంతో మావోయిస్టు పార్టీకి లోటేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






