- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIG Blast: ఆ రెండు ప్రాంతాల్లో భారీ పేలుడు.. స్పాట్‌లోనే ఏడుగురు దుర్మరణం
భారీ పేలుళ్ల కారణంగా ఏడుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రం (Tamilnadu State)లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: భారీ పేలుళ్ల కారణంగా ఏడుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రం (Tamilnadu State)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విరుదునగర్ (Virudhungar) జిల్లా శివకాశి (Sivakasi)లోని ఒక బాణసంచా ఫ్యాక్టరీలో కార్మికులు రసాయనాలను మిక్స్ చేస్తుండగా అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో అక్కడే పని చేస్తున్న ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా.. వారు స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక గాయపడిన వారిని చికిత్స నిమిత్తం శివకాశి ప్రభుత్వాసుపత్రికి తరలిచారు.
అదేవిధంగా సేలం జిల్లా (Selam District) కంచనాయకన్ పట్టి (Kancha Nayakan Patti) గ్రామంలో ద్రౌపది అమ్మవారి రథోత్సవాన్ని నిర్వహిస్తుండగా.. అక్కడ కొందరు బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున వెలువుడిన నిప్పురవ్వలు ఏకంగా బాణసంచా బస్తాపై పడి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 ఏళ్ల ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.






