- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Big Alert: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా?.. డబ్బులు ఈజీగా వస్తాయి కానీ..!
ప్రస్తుత రోజుల్లో డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లి క్యూ కట్టడాలు.. ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి ఇచ్చే వరకూ రిక్వెస్ట్ చేయడాలు చాలా వరకు తగ్గిపోయాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లి క్యూ కట్టడాలు.. ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి ఇచ్చే వరకూ రిక్వెస్ట్ చేయడాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఎవరికీ ఏ అవసరం వచ్చినా లోన్ యాప్స్(APP Loans) ఇన్‌స్టాల్ చేసుకొని డబ్బులు తీసుకుంటున్నారు. నిమిషాల్లోనే డబ్బులు అకౌంట్లలో పడుతుండటంతో అందరూ లోన్ యాప్స్ వాడటం పెరిగిపోయింది. అయితే.. యాప్స్ నుంచి లోన్స్ తీసుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు(Telangana Police) హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ఇన్‌స్టాంట్ లోన్‌యాప్స్ వలలో పడి అప్పుల భారం నెత్తిన వేసుకోవద్దు. ఈజీగా లోన్ వస్తుందనే ఆశతో ఏపీకే ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేయొద్దు. అపరిచిత యాప్స్‌కు మీ మొబైల్‌లో అన్ని పర్మిషన్లు ఇవ్వొద్దు. పరోక్షంగా మీ వ్యక్తిగత డేటాను మీరే సైబర్ నేరగాళ్ల(Cyber Crime)కు అప్పగించొద్దు’ అని హెచ్చరించారు.






