- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి కోసం వెళ్లి ఉచ్చులో.. ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు
ఉపాధి కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టిన ఊరును వదిలి ఖండాలు దాటి వెళ్లిన యువకుడు ఉగ్రవాదుల చెరలో చిక్కాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధి కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టిన ఊరును వదిలి ఖండాలు దాటి వెళ్లిన యువకుడు ఉగ్రవాదుల చెరలో చిక్కాడు. తన బిడ్డ ఎలా ఉన్నాడో అంటూ కన్నతల్లి, ఊరు ఊరంతా ఆ అబ్బాయి కోసం తల్లడిల్లుతున్న ఘటన యదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం (Banda Somaram) గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నల్లమాస జంగయ్య, మహేశ్వరి దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్ గతేడాది నవంబరులో ఓ బోర్‌వెల్ కంపెనీ తరఫున సౌతాఫ్రికా దేశంలోని మాలి దేశంలో కోబ్రి ప్రాంతానికి వెళ్లాడు. ఎంత బిజీగా ఉన్నా ప్రతి రోజూ ఉదయం 9 గంటల సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. గత నెల 22న అతడు ఇంటికి చివరి కాల్ చేశాడు. ఆ తర్వాతి రోజు నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ నెల 4న బోర్‌వెల్ కంపెనీ ప్రతినిధులు ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అతడు కిడ్నాప్ అయ్యాడని సమాచారం అందజేశారు.
కాగా, 23న ప్రవీణ్ విధులు ముగించుకుని తాను ఉంటున్న గది వద్దకు వెళ్తుండగా జేఎన్‌ఐఎం (JNIM) సంస్థకు చెందిన ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని తెలిపారు. గతంలోనూ ఆ ప్రాంతంలో అదే సంస్థకు చెందిన ఉగ్రవాదులు కొంతమంది విదేశీయులను కిడ్నాప్ చేశారు. బోర్‌వెల్ కంపెనీ ప్రతినిధులు భారత రాయబార కార్యాలయం అధికారులతో ప్రవీణ్ ఆచూకీ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుటుంబ సభ్యులు తమ కుమారుడిని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.






