- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి
by Javid Pasha |
సినీ ఇండస్ట్రీని విషాదాలు చుట్టుముట్టుతున్నాయి. సీనియర్ యాక్టర్ శరత్ బాబు మృతిని మరవకముందే భోజ్ పురి డైరెక్టర్ సుభాష్ చంద్ర తివారి మృతి వార్త సినీ రంగాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

X
దిశ, వెబ్ డెస్క్: సినీ ఇండస్ట్రీని విషాదాలు చుట్టుముట్టుతున్నాయి. సీనియర్ యాక్టర్ శరత్ బాబు మృతిని మరవకముందే భోజ్ పురి డైరెక్టర్ సుభాష్ చంద్ర తివారి మృతి వార్త సినీ రంగాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఉత్తరప్రదేశ్ సోన్ భద్రాలోని ఓ హోటల్ ఉంటున్నారు. అయితే బుధవారం రాత్రి హోటల్ డోర్ బయట నుంచి ఎంత పిలిచినా ఆయన స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో తలుపులు పగలగొట్టి చూడగా సుభాష్ చంద్ర తివారి చనిపోయి ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ యశ్వీర్ సింగ్ తెలిపారు. కాగా మహారాష్ట్రకు చెందిన సుభాష్ చంద్ర తివారి భోజ్ పురిలో పలు విజయవంతమైని సినిమాలకు దర్శకత్వం వహించారు.
Next Story






