హైదరాబాద్‌లో మొదటిసారి బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ అరెస్ట్

by Ajay Maddhiboyina |

హైద‌రాబాద్‌లో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల యువతే టార్గెట్‌గా టెలిగ్రామ్‌లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో మొదటిసారి బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ అరెస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌లో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల యువతే టార్గెట్‌గా టెలిగ్రామ్‌లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. కాగా ఓ వ్యక్తి ఆన్ లైన్‌లో రూ.50 లక్షలు పోగొట్టుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు విచారణ జరపగా నలుగురు పట్టుబడ్డారు. నింధితుల్లో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలను డీజీపీ సాయిశ్రీ మీడియాకు వివరించారు.

మనీలాండరింగ్ కోణంలోనూ విచారిస్తున్నట్టు తెలిపారు. బేస్ లెస్ ప్రెడిక్షన్ చేస్తూ ప్రమోటర్లు యూజర్లను మోసం చేస్తున్నారని చెప్పారు. మాయ మాటలతో బెట్టింగ్ రాయుళ్లను రెచ్చగొడుతూ డబ్బులు పెట్టేలా ప్రేరేపిస్తున్నట్టు తెలిపారు. బెట్టింగ్ అనేది ఇల్లీగల్ అని ప్రెడిక్షన్స్ ఇవ్వడం కూడా నేరమే అని స్పష్టం చేశారు. గ్రౌండ్ రియాలిటీకి వాళ్లు చెప్పేదానికి సంబంధం ఉండదని అన్నారు. తెలంగాణలో మొదటి సారి బెట్టింగ్ ప్రమోటర్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

Next Story