- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆన్లైన్లో కాస్ట్లీ ఫోన్ ఆర్డర్ చేసిన టెకీ.. అందులో వచ్చింది చూస్తే షాక్..
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆన్లైన్లో కాస్ట్లీ మొబైల్ ఫోన్ ను ఆర్డర్ చేశాడు. ఎట్టకేలకు ఆ ఫోన్ డెలివరీ రాగా.. దానిని తీసుకుని ఓపెన్ చేసి చూశాడు.

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆన్లైన్లో కాస్ట్లీ మొబైల్ ఫోన్ ను ఆర్డర్ చేశాడు. ఎట్టకేలకు ఆ ఫోన్ డెలివరీ రాగా.. దానిని తీసుకుని ఓపెన్ చేసి చూశాడు. అందుకు ఫోన్ కు బదులుగా ఉన్న వస్తువును చూసి షాకయ్యాడు. అమెజాన్ లో తాను ఫోన్ ఆర్డర్ చేసి మోసపోయానని, అమెజాన్ డెలివరీ స్కామ్ లో రూ.1.86 లక్షలు పోగొట్టుకున్నానని వాపోతూ.. సోషల్ మీడియాలో మొబైల్ పార్శిల్ ఓపెనింగ్ వీడియోను షేర్ చేశాడు.
ఆ టెకీ పేరు ప్రేమానంద్. సామ్ సంగ్ గేలక్సీ జెడ్ ఫోల్డ్ 7 స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ లో అక్టోబర్ 14వ తేదీన ఆర్డర్ చేశాడు. ఆ సమయంలో HDFC క్రెడిట్ కార్డ్ నుంచి పూర్తి పేమెంట్ రూ.1.86 లక్షలను చెల్లించాడు. అక్టోబర్ 19వ తేదీ సాయంత్రం 4.16 గంటలకు ఫోన్ డెలివరీ అయింది. ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఫోన్ అన్ బాక్సింగ్ వీడియోను రికార్డ్ చేసినపుడు హై-ఎండ్ స్మార్ట్ ఫోనుకు బదులుగా స్వ్కేర్ షేపులో ఉన్న ఒక టైల్ ను చూసి షాకయ్యాడు. ఈ ఘటన దీపావళిని ఘనంగా జరుపుకోవాలన్న తమ ఆశలను ఆవిరి చేసిందని అతను వాపోయాడు. ఆన్లైన్ షాపింగ్స్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలని, స్పెషల్ గా అమెజాన్ లో గుడ్డిగా షాపింగ్ చేయవద్దని సూచించాడు.
వెంటనే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేశాడు. అనంతరం కుమారస్వామి లే అవుట్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించి, తనకు జరిగిన మోసం పై లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. అతని కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు BNS సెక్షన్లు 318(4), 319, సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66D కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఫ్రాడ్ వెనుక ఉన్నవారిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






