చిన్న‌పిల్ల‌వి నాకే ప‌నిచెబుతావా? అంటూ న‌ర్సింగ్ విద్యార్థినిపై ప‌నిమ‌నిషి క‌త్తితో దాడి!

by Ajay Maddhiboyina |

బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. సరిగా పనిచేయాలని చెప్పినందుకు పనిమనిషి నర్సింగ్ విద్యార్థినిపై కత్తితో దాడి చేసింది.

చిన్న‌పిల్ల‌వి నాకే ప‌నిచెబుతావా? అంటూ న‌ర్సింగ్ విద్యార్థినిపై ప‌నిమ‌నిషి క‌త్తితో దాడి!
X

దిశ‌, వెబ్ డెస్క్: బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. సరిగా పనిచేయాలని చెప్పినందుకు పనిమనిషి నర్సింగ్ విద్యార్థినిపై కత్తితో దాడి చేసింది. ఈ ఘ‌ట‌న‌లో రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. వివరాల్లోకి వెళితే... మ‌ల్లేశ్వ‌రంలోని బ‌స‌ప్ప గార్డెన్‌లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు వేణుగోపాల్, అతని భార్య సరోజమ్మ నివసిస్తున్నారు. శనివారం వారి ఇంటికి సుష్మిత అనే నర్సింగ్ విద్యార్థిని అతిధిగా వచ్చింది. శనివారం రాత్రి డిన్నర్ కు వచ్చిన సుష్మిత అక్కడే గడిపింది. కాగా ఈ క్రమంలో వారి ఇంట్లో పనిచేస్తున్న లలిత పనిసరిగ్గా చేయకపోవడంతో ప్రశ్నించింది. సరిగ్గా పనిచేయాలంటూ మందలిచింది. దీంతో సుష్మితపై కోపం పెంచుకున్న పనిమనిషి లలిత చిన్నపిల్ల నాకు చెబుతుందా అని ఆగ్రహానికి గురైంది.

రాత్రి ఒంటిగంటకు సుష్మిత నిద్రిస్తున్న సమయంలో ఆమె గదిలోకి ప్రవేశించిన పనిమనిషి తీవ్రంగా గాయపరిచింది. కత్తితో ముఖం, భుజంపై దాడి చేసింది. ఆ సమయంలో సుష్మిత నొప్పితో అరిచినా ఇంటి యజమానాలు గ్రౌండ్ ఫ్లోర్ లో నిద్రించడం వినిపించలేదు. ఈ క్రమంలో సుష్మిత స్పృహ కోల్పోగా మేల్కువ వ‌చ్చిన త‌ర‌వాత తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు స్పృహలోకి వచ్చి సహాయం కోసం ఇంటియ‌జ‌మానికి ఫోన్ చేసింది. వెంట‌నే య‌జ‌మాని సుష్మిత‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story