- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరు రూ 7.11 కోట్ల దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
నవంబర్ 19న కేంద్ర ప్రభుత్వ అధికారిగా నటించిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 7 కోట్ల నగదును ఎత్తుకెళ్లాడు ఈ సంఘటన బెంగళూరులో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: నవంబర్ 19న కేంద్ర ప్రభుత్వ అధికారిగా నటించిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 7 కోట్ల నగదును ఎత్తుకెళ్లాడు ఈ సంఘటన బెంగళూరులో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అశోక పిలర్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి.. క్యాష్ వాన్‌ను అడ్డగించి సుమారు రూ. 7 కోట్ల నగదుతో పరారయ్యాడు. ఈ కేసును బెంగళూరు పోలీసులు ఈ రోజు ఛేదించారు. 200 మందికి పైగా సిబ్బందితో సాగిన దర్యాప్తు (manhunt) తర్వాత ముగ్గురిని అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ వెల్లడించారు.
ఈ కేసు విచారణను వేగవంతం చేయడానికి మొత్తం 11 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, 30 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించినట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో CMS ఇన్ఫోసిస్టమ్స్‌కు చెందిన వాహన ఇన్‌చార్జ్, అదే సంస్థ మాజీ ఉద్యోగి, అలాగే గోవిందపుర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి దోపిడీకి రహస్యంగా సహకరించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఇంకా ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీస్ అధికారి ప్రకటించారు.






