గోల్డ్ షాప్ దుకాణదారులకు బెంగాలీ వర్కర్ టోకరా..

by Chintha Aamani |   (  Updated:2025-08-08 07:14:10  IST  )

బంగారానికి తుది మెరుగులు దిద్దుతా అని అర కిలో బంగారంతో పరారీ అయ్యాడు ఓ వర్కర్

గోల్డ్ షాప్ దుకాణదారులకు బెంగాలీ వర్కర్ టోకరా..
X

దిశ,ఆర్మూర్ : బంగారం వ్యాపారులను నమ్మించి మోసం చేశాడో గోల్డ్ స్మిత్. రాష్ట్రాలను దాటి వచ్చి బంగారానికి తుది మెరుగులు దిద్దుతూ జీవనం సాగిస్తూ.. స్థానిక వ్యాపారులను నట్టేటా ముంచిపోయాడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి. అర కిలో బంగారంతో రాత్రికి రాత్రే ఇంటి యజమానికి సైతం పంగ నామాలు పెట్టి కుటుంబంతో సహా పరారీ అయ్యాడు. ఆర్మూర్ పట్టణంలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన భూపాల్ అనే వ్యక్తి ఎనిమిదేళ్ల క్రితం కుటుంబంతో సహా వచ్చి ఆర్మూర్‌లో ఉంటున్నాడు. స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకోని బంగారు నగలకు మెరుగులు దిద్దే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నమ్మకంగా పని చేస్తున్న భూపాల్‌ను ఆర్మూర్ ప్రాంతంలోని బంగారం వర్తక వ్యాపారులు పూర్తిగా నమ్మారు. దీంతో తమ జ్యువెలరీల్లోని బంగారు నగలకు తుది మెరుగులు దిద్దించుకునే వారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న 10 మంది వ్యాపారులు సుమారు అర కిలో వరకు బంగార నగలను భూపాల్‌కు ఇచ్చి మెరుగులు దిద్దమన్నారు. వారితోపాటు అతను అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ సైతం మూడు తులాల నగలను ఇచ్చాడు. వీటిన్నీంటిని తీసుకున్న భూపాల్.. బుధవారం రాత్రికి రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యారు. గురువారం నగల కోసం వెళ్లిన వ్యాపారులకు భూపాల్ ఇంటికి తాళం వేసి కనిపించింది. ఫోన్లు చేసినా స్పందిన లేకపోవడంతో అర కిలో బంగారంతో ఉడాయించాడని అర్థం అయింది. దీంతో వారంతా ఇంటి యజమానితో కలిసి ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎలాగైనా భూపాల్‌ను పట్టుకోని తమ బంగారం ఇప్పించాలని ఆర్మూర్ బంగారం వర్తక సంఘం వ్యాపారులు పోలీసులను వేడుకున్నారు.

Next Story