- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెడిసి కొట్టిన హాస్టల్ సీటు ఫైరవి
గురుకుల పాఠశాల హాస్టల్ సీటు కోసం చేసిన ఫైరవి బెడిసి కొట్టింది.

దిశ, గన్నేరువరం : గురుకుల పాఠశాల హాస్టల్ సీటు కోసం చేసిన ఫైరవి బెడిసి కొట్టింది. తన దగ్గర 75వేల రూపాయలు లంచం తీసుకున్నారని, న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన వడ్లకొండ వాణి కుమారుడు చరణ్ కు ఏడవ తరగతిలో బీసీ గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించడానికి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ముత్యాల రజని, గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన మీసేవ నిర్వాహకులు తెల్ల రవీందర్, తేల మహేష్ రూ. 75 వేలు తీసుకున్నారు.
అయినా హాస్టల్ సీటు రాకపోవడంతో తిరిగి డబ్బులు ఇవ్వాలని బాధితురాలు కోరింది. అయినా పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయంపై ముత్యాల రజనిని వివరణ కోరగా తాను హాస్టల్ సీటు కోసం ఆమె దగ్గర డబ్బులు తీసుకోలేదని, మీసేవ నిర్వాహకులు తేల మహేష్ తో ఆ మహిళకు పరిచయం ఉండటంతో తాను హాస్టల్లో సీటు కోసం వెళ్లానని చెప్పారు. మీసేవ నిర్వాహకులు కూడా తాము డబ్బులు తీసుకోలేదని పేర్కొన్నారు.
- Tags
- Fraud






