Big Alert: వర్క్‌ ఫ్రమ్‌ హోం జాబ్స్‌ విషయంలో జాగ్రత్త!

by Gantepaka Srikanth |

మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు రోజూ రూ.500 నుంచి రూ.1000 సంపాదించుకోవచ్చు.

Big Alert: వర్క్‌ ఫ్రమ్‌ హోం జాబ్స్‌ విషయంలో జాగ్రత్త!
X

దిశ, వెబ్‌డెస్క్: మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు రోజూ రూ.500 నుంచి రూ.1000 సంపాదించుకోవచ్చు. నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదించొచ్చు అంటూ నెట్టంట అనేక పోస్టులు కనిపిస్తూనే ఉంటాయి. అయితే.. వీటిని కొందరు లైట్ తీసుకొని వదిలేస్తుండగా.. మరికొందరు జాబ్ అవసరమై రియాక్ట్ అవుతుంటారు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లకు(Cyber Crimes) చిక్కి మోసపోతున్నారు. అలాంటి వారిలో అవగాహన కలిగేలా తెలంగాణ పోలీసులు(Telangana Police) అప్రమత్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘కేవలం మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఇంట్లో ఉంటూనే వేలు సంపాదించవచ్చనే మాటల్ని నమ్మకండి. వర్క్‌ ఫ్రమ్‌ హోం జాబ్స్‌(Work-From-Home Job) విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆన్‌లైన్ టాస్క్‌లు, మార్కెటింగ్‌తో డబ్బులు రావు. ఇలాంటి మోసాలపై అవగాహన పెంచుకోండి’ అని పేర్కొన్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని వర్క్ ఫ్రమ్ హోం పేరిట సైబర్ నేరగాళ్లు మోసగించారు. ఇన్​స్టాలో రీల్స్ చూసి సదరు నంబర్‌కు కాల్ చేసింది. దీంతో స్కామర్లు తొలుత ఆమెకు వాట్సాప్​లో కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. ఆ తర్వాత ఆమెచేతనే ఇన్వెస్టులు చేయించి మోసం చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Next Story