- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ జిల్లాలో భారీగా నిషేధిత గుట్కా పట్టివేత...
by Batti.Sumithra |
జనగామ జిల్లా ఘన్పూర్ మండల కేంద్రానికి చెందిన సయాద్ సర్వర్ మియాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

X
దిశ, జనగామ : జనగామ జిల్లా ఘన్పూర్ మండల కేంద్రానికి చెందిన సయాద్ సర్వర్ మియాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ చెప్పిన వివరాల ప్రకారం ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గుట్కా విక్రయాలు జరుపుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పీఎస్ ఘన్పూర్ స్టేషన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ బృందం దాడి చేశారు. ఈ దాడిలో సయాద్ సర్వర్ మియా సన్ అఫ్ వలీమియా అనే వారి వద్ద మొత్తం రూ 1,18,730/-విలువగల నిషేధిత గుట్కాను పట్టుకుని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న సొత్తుతో పాటు నిందితులను తదుపరి చర్యల నిమిత్తం స్టేషన్‌ఘన్‌పూర్ పోలీసులకు అప్పగించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.బాబులాల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






