దారుణం.. విడాకుల నోటీసులు పంపిందని భార్యను కాల్చి చంపిన భర్త

by Ajay Maddhiboyina |

బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. విడాకుల నోటీసులు పంపిందని ఓ భర్త తన భార్యను తుపాకీతో కాల్చి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

దారుణం.. విడాకుల నోటీసులు పంపిందని భార్యను కాల్చి చంపిన భర్త
X

దిశ‌, వెబ్ డెస్క్: బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. విడాకుల నోటీసులు పంపిందని ఓ భర్త తన భార్యను తుపాకీతో కాల్చి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు సేలం జిల్లాకు చెందిన బాల మురుగన్, భువనేశ్వరిలకు 2011లో వివాహం జరగ్గా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ ఉద్యోగరీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారు. బాలమురుగన్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేయగా భువనేశ్వరి బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది. అయితే నాలుగేళ్ల క్రితం బాల మురుగన్ ఉద్యోగం మానేసినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరగ్గా కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. కాగా వారం రోజుల క్రితం భర్తకు భువనేశ్వరి విడాకుల నోటీసులు పంపినట్టు పోలీసులు చెబుతున్నారు. అంతే కాకుండా భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు బాల మురుగన్ అనుమానం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే విడాకుల నోటీసులు పంపిన వారం రోలకు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన భార్యపై అక్కడకు వచ్చిన బాలమురుగన్ నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. భార్యను హత్య చేసిన అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

Next Story